Wednesday, July 15, 2026
Chat on WhatsApp
HomeTelanganaCM Revanth Reddy | రిటైర్డ్ ఉద్యోగులకు శుభవార్త... .2,000 కోట్లు విడుదల

CM Revanth Reddy | రిటైర్డ్ ఉద్యోగులకు శుభవార్త… .2,000 కోట్లు విడుదల

-

Chat on WhatsApp

CM Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి పూర్తి నిబద్ధతను మరోసారి స్పష్టం చేసింది. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను మాటలకే పరిమితం చేయకుండా, అమలు దిశగా కీలక చర్యలు చేపట్టింది.

సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు ఉద్యోగ జేఏసీ నాయకులకు ఇచ్చిన హామీ ప్రకారం, 100 రోజుల్లో రూ.6,000 కోట్ల బకాయిలు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో తొలి విడతగా రూ.2,000 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.

ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. విడుదల చేసిన నిధులతో రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన కీలక బకాయిలను ప్రభుత్వం పూర్తిగా క్లియర్ చేసింది.

ప్రత్యేకంగా రిటైర్డ్ ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF) బకాయిలను 100 శాతం చెల్లించడంతో పాటు, మే 2025 వరకు పెండింగ్‌లో ఉన్న కమ్యూటేషన్ బకాయిలన్నింటినీ పూర్తిగా విడుదల చేశారు.

ఇచ్చిన మాట ప్రకారం మిగిలిన రూ.4,000 కోట్ల బకాయిలను కూడా నిర్ణీత గడువులోగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయడానికి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోందని అధికారులు తెలిపారు. ఈ నిర్ణయంపై ఉద్యోగ సంఘాల నాయకులు, రిటైర్డ్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

andhra pradesh government to conduct mudragada padmanabham last rites with state honours

Mudragada Padmanabham | ముద్రగడ సేవలకు గౌరవ వందనం.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సుదీర్ఘకాలం ప్రజా ప్రతినిధిగా సేవలందించిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham)కు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆయన ప్రజా జీవితంలో అందించిన సేవలకు...
- Advertisement -
Chat on WhatsApp