Gold Rates Today: పసిడి కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి ఊరటనిచ్చే వార్త వచ్చింది. గత రెండు రోజులుగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో గోల్డ్‌తో పాటు వెండి ధరల్లోనూ స్వల్ప పతనం నమోదవడంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు. గురువారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,060గా నమోదైంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,050 వద్ద ఉండగా, 18 క్యారెట్ల బంగారం రూ.1,17,040 వద్ద ట్రేడ్ అయింది.
అయితే శుక్రవారం ఉదయం బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. గుడ్‌రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం ఉదయం 6 గంటల సమయానికి హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,050గా నమోదైంది.
అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం రూ.1,43,040 వద్ద ఉండగా, 18 క్యారెట్ల బంగారం రూ.1,17,030 వద్ద కొనసాగుతోంది. బంగారం ధరలతో పాటు వెండి ధరల్లో కూడా తగ్గుదల నమోదైంది. గురువారం హైదరాబాద్‌లో 10 గ్రాముల వెండి ధర రూ.28,500గా ఉండగా, కిలో వెండి రూ.2,85,000 వద్ద ట్రేడ్ అయింది.
శుక్రవారం ఉదయం 10 గ్రాముల వెండి ధర రూ.28,490కు తగ్గగా, కిలో వెండి రూ.2,84,900 వద్ద కొనసాగుతోంది. ఇక ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధరలు (10 గ్రాములకు) పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ముంబై, బెంగళూరులో రూ.1,56,050గా ఉన్నాయి. ఢిల్లీలో రూ.1,56,200 కాగా, చెన్నై, మధురై, కోయంబత్తూరులో రూ.1,58,170గా నమోదయ్యాయి.








