HomeTelanganaHyderabadAmberpet Fire Accident | హైదరాబాద్‌లో కలకలం.. సర్వీస్ సెంటర్‌లో మంటలు, వాహనాలు దగ్ధం

Amberpet Fire Accident | హైదరాబాద్‌లో కలకలం.. సర్వీస్ సెంటర్‌లో మంటలు, వాహనాలు దగ్ధం

-

Chat on WhatsApp

Amberpet Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అంబర్‌పేటలోని 6 నంబర్ చౌరస్తా సమీపంలో ఉన్న మహీంద్రా సర్వీస్ సెంటర్‌లో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే మంటలు తీవ్రరూపం దాల్చడంతో ఆ ప్రాంతమంతా నల్లటి దట్టమైన పొగ కమ్మేసింది.

ప్రమాద సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో అదనంగా ఫైర్ ఇంజిన్లు రంగంలోకి దింపి ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.

సర్వీస్ సెంటర్ పక్కనే నివాస సముదాయాలు ఉండటంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. మంటలు సమీప భవనాలకు వ్యాపిస్తాయేమోనన్న ఆందోళనతో అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. సమీప ఇళ్లలో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

ఈ ఘటనలో సర్వీస్ సెంటర్‌లో ఉన్న పలు వాహనాలు, విడిభాగాలు పూర్తిగా అగ్నికి ఆహుతైనట్లు సమాచారం. భారీ నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.

అయితే అగ్నిప్రమాదానికి గల అసలు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్ కారణమా లేదా ఇతర కారణాలా అన్నది దర్యాప్తులో తేలనుంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Lionel Messi | మెస్సీ ఇంట తీవ్ర విషాదం.. తండ్రి జార్జ్ మెస్సీ కన్నుమూత

Lionel Messi: ఫుట్‌బాల్ ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ తండ్రి, ఆయన కెరీర్‌కు బలమైన అండగా నిలిచిన జార్జ్ మెస్సీ (68)...
- Advertisement -
Chat on WhatsApp