HomeTelanganaBIG Breaking | ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆగ్రహం...నర్సంపేటలో పెట్రోల్ పోసుకొని RTC డ్రైవర్ ?

BIG Breaking | ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆగ్రహం…నర్సంపేటలో పెట్రోల్ పోసుకొని RTC డ్రైవర్ ?

-

Chat on WhatsApp

ఆర్టీసీ కార్మికుల సమ్మె రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా వరంగల్ జిల్లా నర్సంపేటలో ఒక ఆర్టీసీ డ్రైవర్ ఆత్మ*హ**త్యాయత్నానికి పాల్పడిన(RTC driver suicide attempt) ఘటన తీవ్ర కలకలం రేపింది.

ఆర్టీసీ డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని ఆరోపిస్తూ కార్మిక సంఘాలు రెండోరోజు కూడా సమ్మెను కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో అన్ని డిపోల ఎదుట మహాధర్నాలు నిర్వహించాయి.

నర్సంపేట ఆర్టీసీ డిపో వద్ద జరుగుతున్న ధర్నాలో పాల్గొన్న డ్రైవర్ కోలా రమేశ్ గౌడ్ అకస్మాత్తుగా తనపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనతో అక్కడ ఉన్న సహచర కార్మికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

అప్రమత్తమైన తోటి కార్మికులు వెంటనే మంటలను ఆర్పి అతన్ని రక్షించారు. తీవ్రంగా గాయపడిన రమేశ్ గౌడ్‌ను వెంటనే వరంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఈ ఘటనతో ఆర్టీసీ సమ్మె మరింత ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్లు మరింత బలపడుతున్నాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Lionel Messi | మెస్సీ ఇంట తీవ్ర విషాదం.. తండ్రి జార్జ్ మెస్సీ కన్నుమూత

Lionel Messi: ఫుట్‌బాల్ ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ తండ్రి, ఆయన కెరీర్‌కు బలమైన అండగా నిలిచిన జార్జ్ మెస్సీ (68)...
- Advertisement -
Chat on WhatsApp