Saturday, March 14, 2026
No menu items!
Home National Stock Market Today | Sensex, Nifty భారీ లాభాలతో ముగిశాయి

Stock Market Today | Sensex, Nifty భారీ లాభాలతో ముగిశాయి

0
32
Indian stock market rise
Indian stock market rise

Stock Market Update: దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. బడ్జెట్ సందర్భంగా పన్ను పొటు ప్రభావంతో గత స్పెషల్ సెషన్‌లో నష్టాల మధ్య ఉన్న సూచీలు, నేడు మదుపర్ల దృష్టి ఇతర అంశాలపై కేంద్రీకృతం కావడంతో మళ్లీ దూసుకెళ్లాయి.

ముఖ్యంగా “రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industrys)”, “అదానీ పోర్ట్స్”షేర్లు సూచీలను మద్దతుగా నిలిపాయి. సూచీలు ఉదయం నష్టాల్లో ప్రారంభమై, ఇంట్రాడేలో మోస్తరు లాభాలతో కదలాడిన తరువాత, చివరికి కొనుగోళ్ల మద్దతుతో “సెన్సెక్స్ 81,666.46 పాయింట్ల” వద్ద, “నిఫ్టీ 25,088.40 పాయింట్ల” వద్ద ముగిసాయి.

మొత్తం మార్కెట్ కేపిటలైజేషన్ ₹455 లక్షల కోట్లకు చేరి ₹5 లక్షల కోట్లు పెరిగింది. డాలర్‌తో రూపాయి మారకం 91.50 వద్ద స్థిరపడింది. “సెన్సెక్స్ 30″(Sensex ) లో పవర్‌గ్రిడ్, అదానీ పోర్ట్స్, బిఈఎల్, రిలయన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా లాభపడ్డాయి.

కాగా యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ట్రెంట్, టైటాన్ షేర్లు నష్టాలు చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో “బ్రెంట్ క్రూడ్ 66 డాలర్ల”, బంగారం 4,680 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.

ALSO READ:Phone Tapping Case | ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఆలస్యంపై కవిత అసంతృప్తి