Saturday, March 21, 2026
Google search engine
HomeFilms NewsChampion on Netflix: ఓటీటీలో సందడి చేస్తున్న రోషన్ మేకా మూవీ

Champion on Netflix: ఓటీటీలో సందడి చేస్తున్న రోషన్ మేకా మూవీ

-

Google search engine

 Champion Movie OTT: యంగ్ హీరో రోషన్ మేకా హీరోగా నటించిన తాజా చిత్రం “ఛాంపియన్” అనూహ్యంగా ఓటీటీలోకి అడుగుపెట్టింది. పీరియాడిక్ నేపథ్యంతో రూపొందిన ఈ ఇంటెన్స్ ఎమోషనల్ డ్రామాకు దర్శకుడు ప్రదీప్ అద్వైతమ్ దర్శకత్వం వహించారు.

స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం భారీ అంచనాల నడుమ 2025 డిసెంబర్ 25న క్రిస్మస్ స్పెషల్‌గా థియేటర్లలో విడుదలైంది. తాజాగా అదే సినిమా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా నిలిచింది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ “నెట్‌ఫ్లిక్స్” ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుని, “జనవరి 29 నుంచి స్ట్రీమింగ్” ప్రారంభించింది.

థియేటర్లలో ఈ చిత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించకపోయినా, రోషన్ మేకా నటన, కథనం, హై క్వాలిటీ మేకింగ్ వాల్యూస్‌కు మంచి ప్రశంసలు లభించాయి. హీరోయిన్‌గా అనశ్వర రాజన్ ఆకట్టుకోగా, మెలోడీ బ్రహ్మ మిక్కీ జే మేయర్ సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది.

విభిన్నమైన కథాంశంతో రూపొందిన ఈ పీరియాడిక్ డ్రామాను థియేటర్లలో మిస్ అయిన వారు, ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో వీక్షించవచ్చు. ఈ వీకెండ్‌లో ఓ ఎమోషనల్, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమా చూడాలనుకునే వారికి “ఛాంపియన్’ మంచి ఎంపిక”గా నిలుస్తోంది.

also read:Gold and Silver Prices Today | ఆకాశాన్ని అంటుతున్న బంగారం, వెండి ధరలు….కిలో వెండి ఎంతంటే ?

- Advertisement -
Google search engine
- Advertisment -
Google search engine

Must Read

telangana high court hearing plea challenging speaker decision on danam nagender disqualification case

Danam Nagender | హైకోర్టులో ఎమ్మెల్యే దానం పార్టీ ఫిరాయింపు కేసు…స్పీకర్ నిర్ణయానికి సవాల్

Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వివాదం ఇప్పుడు తెలంగాణ హైకోర్టు వరకు చేరడంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది. దానం నాగేందర్ పార్టీ మారలేదని తెలంగాణ అసెంబ్లీ...
- Advertisement -
Google search engine