Tuesday, June 30, 2026
Chat on WhatsApp
HomeNationalRupee Value Today: రూపాయి విలువ ఆల్‌టైమ్ కనిష్ఠం...డాలర్‌తో మారకం రేటు 91.74కి చేరింది

Rupee Value Today: రూపాయి విలువ ఆల్‌టైమ్ కనిష్ఠం…డాలర్‌తో మారకం రేటు 91.74కి చేరింది

-

Chat on WhatsApp

Rupee Value: దేశీయ కరెన్సీ రూపాయి పతనం కొనసాగుతోంది.అంతర్జాతీయ మార్కెట్‌లో బుధవారం ఇంట్రాడే ట్రేడింగ్ లో అమెరికా డాలర్(US Dollar) తో పోల్చుకుంటే మన రూపాయి విలువ 91.74 వద్ద అల్టైమ్ కనిష్ఠానికి పడిపోయింది.

ఇప్పటివరకు రూపాయికి ఇదే కనిష్ఠ స్థాయి. దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ మదుపర్లు నిధులను తొలగించడం, అమెరికా తో వాణిజ్య ఒప్పందం ఆలస్యం వంటివి రూపాయి విలువపై ప్రతికూల ప్రభావం చూపాయి.

అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక(global economic) అనిశ్చిత పరిస్థితులు, ద్రవ్యోల్బణ, గ్లోబల్ మార్కెట్ వోలాటిలిటీ కూడా రూపాయి విలువ పతనానికి కారణమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

డిసెంబర్‌లో రూపాయి 91 మార్కును దాటిన తర్వాత, తాజాగా మరోసారి 91.74 వద్ద ఆల్‌టైమ్ కనిష్ఠానికి చేరడం ప్రత్యేకమైన ఘటనగా మారింది. రూపాయి ఈ స్థాయిలో కొనసాగితే దిగుబడి పెట్టుబడులు, వాణిజ్య లావాదేవీలపై ప్రభావం ఏర్పడే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Vijayawada-Hyderabad | కట్టంగూర్ సమీపంలో రోడ్డు ప్రమాదం.. బస్సు, రెడీమిక్స్ లారీ ఢీ, ఇద్దరికి...

Vijayawada-Hyderabad: నల్గొండ జిల్లాలో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కట్టంగూర్ మండలంలోని ముత్యాలమ్మగూడెం సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, రెడీమిక్స్ లారీ ఒకదానికొకటి ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది....
- Advertisement -
Chat on WhatsApp