Telangana Politics | వదలొద్దు..కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్  ఇవ్వండి 

Telangana CM Revanth Reddy during a high-level meeting with ministers in Hyderabad Telangana CM Revanth Reddy during a high-level meeting with ministers in Hyderabad

Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో అధికార మరియు ప్రతిపక్షాల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు ఉదృతంగా మారుతున్నాయి. మాజీ సీఎం కేసీఆర్(KCR) ప్రాజెక్టులపై చేసిన వ్యాఖ్యలను గట్టిగా తిప్పికొట్టాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మంత్రులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. “వదలొద్దు.. ప్రతిమాటకు కౌంటర్ ఇవ్వాలి” అంటూ మంత్రుల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.


 మంత్రుల సమావేశంలో కీలక చర్చ 

సోమవారం సాయంత్రం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన సమావేశంలో పంచాయతీ ఎన్నికల ఫలితాలపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. ZPTC, MPTC, GHMC ఎన్నికల్లో ఇంకా మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు. రాజకీయ లడాయి మొదలైందని వ్యాఖ్యానించారు.

 పాలమూరు–రంగారెడ్డి అంశం 

పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్న కేసీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాలని సీఎం సూచించారు. బీఆర్‌ఎస్ హయాంలోనే ప్రాజెక్టు డీపీఆర్ కేంద్రం నుంచి వెనక్కి వచ్చిందని, ఎన్జీటీ కేసులో తాగునీటి ప్రాజెక్టుగా మాత్రమే పరిమితం చేశారని లెక్కలతో ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.

ALSO READ:బంగ్లాదేశ్‌కు సర్జరీ అవసరం…హిమంత బిశ్వశర్మ కీలక వ్యాఖ్యలు 

 నీటి వాటాలపై అసెంబ్లీ చర్చ 

కృష్ణా–గోదావరి నదీజలాల విషయంలో బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన అన్యాయాలను అసెంబ్లీ వేదికగా ఎండగట్టాలని సీఎం సూచించారు. ఈ అంశంపై విస్తృత చర్చ కోసం డిసెంబర్ 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు సమాచారం.

 మున్సిపల్ ఎన్నికలు, గ్రేటర్ విస్తరణ 

ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై ప్రాథమిక చర్చ జరిగింది. అలాగే గ్రేటర్ హైదరాబాద్‌ను మూడు కార్పొరేషన్లుగా విస్తరించే అంశాన్ని కూడా సీఎం మంత్రులతో చర్చించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *