Wednesday, March 11, 2026
No menu items!
Home National Bengaluru airport | బెంగుళూరు ఎయిర్‌పోర్టులో రూ.200 కోట్ల గంజాయి సీజ్ 

Bengaluru airport | బెంగుళూరు ఎయిర్‌పోర్టులో రూ.200 కోట్ల గంజాయి సీజ్ 

0
15
Customs officials seize ₹200 crore worth cannabis at Bengaluru airport
Customs officials seize ₹200 crore worth cannabis at Bengaluru airport

Bengaluru Airport: బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో(Bengaluru International Airport) భారీ స్థాయిలో గంజాయి అక్రమ రవాణా బయటపడింది. కస్టమ్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో రూ.200 కోట్ల(₹200 crore) విలువ చేసే 273 కిలోల విదేశీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

బ్యాంకాక్ నుంచి బెంగుళూరు చేరుకున్న నలుగురు విదేశీయుల వద్ద సంచులు, లగేజ్‌లలో అనుమానాస్పద పదార్థాలను గుర్తించిన అధికారులు వాటిని పరీక్షించగా అవి అధిక నాణ్యత గల గంజాయి అని తెలిసింది.

ALSO READ:Telangana Movement History | కేసీఆర్ ఆమరణ దీక్ష నేటికీ 16 ఏళ్లు…దాస్య శృంఖలాలు తెంచి

ఈ అక్రమ రవాణా వ్యవహారంలో నలుగురు విదేశీయులతో పాటు మొత్తం 32 మందిని అరెస్ట్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. నిందితులు గంజాయిని ఎనర్జీ డ్రింక్ టిన్స్‌లో నింపి, సాధారణ కార్గోలా కనిపించేలా మార్చి రవాణా చేసినట్లు విచారణలో తెలిసింది.

ఈ మోడ్ ఆపరేషన్ ద్వారా భారీ పరిమాణంలో డ్రగ్స్‌ను భారత్‌లోకి తరలించే యత్నం చేసినట్లు అధికారులు తెలిపారు.
కస్టమ్స్ విభాగం ఘటనపై మరింత దర్యాప్తు కొనసాగిస్తోంది.

ఈ సీజ్ దక్షిణాదిలో ఇటీవల కాలంలో బయటపడిన అతిపెద్ద డ్రగ్ కేసులలో ఒకటిగా గుర్తించారు. డ్రగ్ ట్రాఫికింగ్ నియంత్రణలో భాగంగా విమానాశ్రయ భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులు సూచించారు.

YouTube thumbnailYouTube icon