Maoists Surrender Letter | ఆయుధాలు వీడేందుకు సిద్ధం…ఫిబ్రవరి 2026 వరకు..

Maoist representative sends surrender letter to state Chief Ministers Maoist representative sends surrender letter to state Chief Ministers

Maoist Letter:ఆయుధాలను వీడేందుకు సిద్ధంగా ఉన్నాం అని మావోయిస్టులు లేక విడుదల చేసారు.దానికి  సిద్ధంగా ఉన్నట్లు తెలియజేస్తూ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులకు మావోయిస్టు ప్రతినిధి పేరిట ఒక ముఖ్యమైన లేఖ పంపబడింది.

కేంద్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ సోను దాదా తీసుకున్న “పోరాటం నిలిపివేయాలి” అనే నిర్ణయానికి తాము మద్దతిస్తున్నామని లేఖలో పేర్కొన్నారు.

ప్రభుత్వ పునరావాసాన్ని స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే అన్ని ప్రాంతాల మావోయిస్టులతో చర్చించి సమష్టి నిర్ణయానికి రావడానికి “2026 ఫిబ్రవరి 15 వరకు సమయం ఇవ్వాలని” కోరారు. ఈ నిర్ణయం వెనుక ఎలాంటి రహస్య ఉద్దేశం లేదని, పూర్తిగా శాంతి కోసం తీసుకున్న అడుగేనని లేఖలో స్పష్టం చేశారు.

ఈ లేఖ వెలుగులోకి రావడంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, భద్రతా సంస్థలు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. దీర్ఘకాలం కొనసాగిన వామపంథ పోరాటం ముగింపు దిశగా వెళ్తుందా అనే ప్రశ్న చర్చనీయాంశంగా మారింది.

ALSO READ:Telangana BJP | పంచాయతీ నుండి GHMC వరకు అన్ని స్థానాల్లో  పోటీకి BJP సన్నాహం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *