TG: తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల జరగనుండటంతో ఎన్నికల ఖర్చుపై ఈసీ క్లారిటీ ఇచ్చింది. గ్రామాల జనాభా ఆధారంగా అభ్యర్థులు ఖర్చు చేయాల్సిన గరిష్ట పరిమితులను విడుదల చేసింది.
5 వేలకుపైగా ఓటర్లు ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు గరిష్టంగా “రూ.2.50 లక్షలు” ఖర్చు చేయవచ్చని ఈసీ తెలిపింది. అదే విధంగా, 5 వేలలోపు ఓటర్లు ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థుల ఖర్చు పరిమితిని “రూ.1.50 లక్షలు” గా నిర్ణయించింది.
ALSO READ:Trump Ukraine Peace Plan | పీస్ ప్లాన్‌కు జెలెన్‌స్కీ ఒప్పుకోవాల్సిందే: ట్రంప్
వార్డు సభ్యుల విషయంలో కూడా ఖర్చు పరిమితులు స్పష్టంగా పేర్కొన్నాయి. 5 వేలకుపైగా జనాభా ఉన్న గ్రామాల్లో వార్డు సభ్యులు గరిష్టంగా “రూ.50 వేల” వరకు ఖర్చు చేయాలని ఈసీ ఆదేశించింది. 5 వేలకంటే తక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో వార్డు సభ్యుల ఖర్చు పరిమితి “రూ.30 వేల” గా నిర్ణయించింది.
త్వరలో విడుదలకానున్న ఎన్నికల షెడ్యూల్‌కు ముందుగానే ఈ క్లారిటీ ఇవ్వడం ద్వారా అభ్యర్థులు తమ ప్రణాళికలను సిద్ధం చేసుకునే అవకాశాన్ని ఈసీ కల్పించింది.
