HomeMahabubnagarJadcherlaహైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు..తప్పిన ముప్పు

హైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు..తప్పిన ముప్పు

-

Chat on WhatsApp

Mahabubnagar Bus Accident:మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మం. మాచారం సమీపంలోని నేషనల్ హైవేపై ఉదయం పెద్ద ప్రమాదం తప్పింది. హైదరాబాద్‌కు వెళ్తున్న జగన్ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు, హైడ్రోక్లోరిక్ యాసిడ్‌ను తరలిస్తున్న కెమికల్ ట్యాంకర్‌(Hydrochloric Acid Tanker)ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఢీకొట్టిన వెంటనే ట్యాంకర్ నుంచి భారీగా తెల్లని పొగలు ఎగిసిపడటంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.

also read:Pratyusha Death Case:సినీ నటి ప్రత్యూష మృతి కేసు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు

పరిస్థితి అదుపుతప్పుతుంది అనే  అనుమానంతో బస్సులో ఉన్న ప్రయాణికులు ఎమర్జెన్సీ డోర్ ద్వారా బయటకు దూకి తమ ప్రాణాలను రక్షించుకున్నారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. యాసిడ్ లీక్ అయ్యే ప్రమాదం ఉండటంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న సిబ్బంది పరిస్థితిని నియంత్రించారు. రసాయన మోసే వాహనాలు రాత్రి వేళల్లో జాగ్రత్తగా నడపాల్సిన అవసరం ఉందని అధికారులు సూచించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Lionel Messi | మెస్సీ ఇంట తీవ్ర విషాదం.. తండ్రి జార్జ్ మెస్సీ కన్నుమూత

Lionel Messi: ఫుట్‌బాల్ ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ తండ్రి, ఆయన కెరీర్‌కు బలమైన అండగా నిలిచిన జార్జ్ మెస్సీ (68)...
- Advertisement -
Chat on WhatsApp