Delhi Bomb Threat :ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపుల కలకలం

Delhi police inspecting schools after mass bomb threat emails Delhi police inspecting schools after mass bomb threat emails

Delhi Bomb Threat:ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోర్టులు మరియు విద్యాసంస్థలను లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు పంపించారు. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమై పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.

also read:గుజరాత్‌లో ఘోర విషాదం..నవజాత శిశువు సహా నలుగురి సజీవ దహనం

ఇటీవల కూడా ఢిల్లీలోని అనేక ప్రైవేట్ పాఠశాలలకు ఇలాంటి బెదిరింపు ఈమెయిల్స్ రావడంతో, పోలీసులు స్కూళ్లలో పూర్తిస్థాయి చెకింగ్ నిర్వహించారు. ఈసారి కూడా వందకు పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

అయితే పరిశీలనలో ఇవన్నీ నకిలీ బెదిరింపులేనని, ఎటువంటి ప్రమాదం లేదని పోలీసులు స్పష్టం చేశారు. అయినప్పటికీ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *