ఏపీ సీఎం చంద్రబాబు ఈనెల 19న కడప జిల్లాను సందర్శించనున్నట్లు సమాచారం. కమలాపురం నియోజకవర్గంలోని పెండ్లిమర్రి(Pendlimarri) మండలంలో రైతులతో సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులకు సూచనలు వెళ్లినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, పీఎం కిసాన్(PM Kisan) నిధుల విడుదల అనంతరం, రైతులకు ఆ నిధులు ఎలా ఉపయోగపడుతున్నాయో స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించాలనే ఉద్దేశంతో ఈ పర్యటనను ప్లాన్ చేసినట్లు సమాచారం.
also read:Chaitanya Techno School:విద్యార్థి చెయ్యి విరిగినా పట్టించుకోని యాజమాన్యం
రైతుల సమస్యలు, సాగు పరిస్థితులు, భూముల పరిస్థితిపై సీఎం ప్రత్యక్ష సమీక్ష చేస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు వేగంగా పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించినట్లు తెలుస్తుంది.
ఈ పర్యటన షెడ్యూల్‌ను నేడు లేదా రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
