Srinagar Naugam Blast: ఉగ్రదాడి కాదు, యాక్సిడెంట్ మాత్రమే 

Naugam police station blast site in Srinagar with officials inspecting damage Naugam police station blast site in Srinagar with officials inspecting damage

Srinagar Naugam Blast: ఢిల్లీ ఘటన మరవక ముందే  దేశంలో మరో పేలుడు సంభవించింది.శ్రీనగర్‌లోని నౌగామ్‌ పోలీస్‌ స్టేషన్‌లో జరిగిన భారీ పేలుడు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. ఘటనలో తహసీల్దార్‌, ఇన్‌స్పెక్టర్‌తో సహా మొత్తం 9 మంది మృతి చెందగా, 27 మంది గాయపడ్డారు.

ఈ పేలుడు ఉగ్రదాడి కాదని, ప్రమాదవశాత్తు జరిగినదేనని కశ్మీర్‌ డీజీపీ(kashmir DGP) నళిన్‌ ప్రభాత్‌ స్పష్టం చేశారు.

వైట్‌ కాలర్‌ ఉగ్రవాద మాడ్యూల్‌పై జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ఫరీదాబాద్‌లో స్వాధీనం చేసిన అత్యంత సున్నితమైన పేలుడు పదార్థాలను పోలీస్‌ స్టేషన్‌లో విశ్లేషణ కోసం ఉంచగా, శుక్రవారం రాత్రి 11:20 గంటలకు శాంపుల్‌ కలెక్షన్ సమయంలో ప్రమాదవశాత్తు పేలుడు సంభవించినట్లు తెలిపారు.

ఫరీదాబాద్‌లో అరెస్టు చేసిన డాక్టర్‌ ముజమ్మిల్‌ గనాయ్‌ అద్దె ఇంటి నుండి స్వాధీనం చేసిన ఈ పేలుడు పదార్థాలు, నవంబర్‌ 10న ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు కేసుకు సంబంధించినవని అధికారులు వెల్లడించారు.

ALSO READ:AP Liquor Scam Arrest: ముంబై మద్యం స్కామ్ అనిల్ చోఖ్రా అరెస్ట్

పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటంతో సమీప భవనాలు కూడా దెబ్బతిన్నాయి. హోంశాఖ కూడా ఇది పూర్తిగా ప్రమాదవశాత్తు సంఘటనేనని ధృవీకరించింది. గాయపడిన 27 మంది చికిత్స పొందుతున్నారు మరియు బాధిత కుటుంబాలకు సహాయం అందజేస్తామని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *