Tuesday, March 17, 2026
No menu items!
Home Telangana Teachers TET Tension: సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇన్‌సర్వీస్ టీచర్లలో ఆందోళన 

Teachers TET Tension: సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇన్‌సర్వీస్ టీచర్లలో ఆందోళన 

0
9
Teachers concerned over mandatory TET qualification after Supreme Court orders
Teachers concerned over mandatory TET qualification after Supreme Court orders

ఉపాధ్యాయుల్లో “టెట్” విషయంలో టెన్షన్(Teachers TET Tension) పెరిగింది. పీఈటీలు, పీడీలు మినహా ఇతర ఇన్‌సర్వీస్ టీచర్లు వచ్చే రెండు సంవత్సరాల్లో తప్పనిసరిగా TET అర్హత సాధించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈ నిర్ణయం పదోన్నతులు, ఉద్యోగ భద్రతపై ప్రభావం చూపుతుందన్న భయం టీచర్లలో పెరిగింది.

ALSO READ:Telangana Next BJP Govt వస్తుంది బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు 


ఉమ్మడి వరంగల్ జిల్లాలో 10 వేల మంది ఉపాధ్యాయుల్లో సుమారు 90% మందికి ఇప్పుడు టెట్(TET Exam) తప్పనిసరి అవుతోంది. ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలు ఈ అంశంపై ఎన్సీటీఈ, రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తూ మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.

ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయుల(In-Service Teachers) పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని పునర్విమర్శ చేయాలని సంఘాలు కోరుతున్నాయి.