ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం(Bank Merger Policy) దేశ ఆర్థిక వ్యవస్థకు లాభదాయకమని SBI ఛైర్మన్ శ్రీనివాసులు శెట్టి తెలిపారు. బ్యాంకింగ్ రంగంలో మరోసారి విలీనాలు జరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.
ఇంకా కొన్ని చిన్న బ్యాంకులు ఉన్నందున భవిష్యత్తులో విలీనాలు జరుగుతే అది సహజమేనని భావిస్తున్నట్లు చెప్పారు.
అమెరికా విధించిన అదనపు టారిఫ్ కారణంగా భారత ఎగుమతులపై ప్రభావం పడినా, SBIకు ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురుకాలేదని ఆయన స్పష్టం చేశారు. ఎగుమతిదారులకు మద్దతు కొనసాగుతుందంటూ శెట్టి చెప్పారు.
బ్యాంక్ మార్కెట్ వాటా విషయంలో SBI ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడదని ఆయన తెలిపారు. రాబోయే కాలంలో విలీనం వ్యూహాలు బ్యాంకింగ్ రంగం బలపర్చడంలో కీలక పాత్ర పోషిస్తాయని అభిప్రాయపడ్డారు.
also read:iBomma Founder Arrested:iBomma నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్
