BBC apology to Trump | డాక్యుమెంటరీ ఎడిటింగ్ వివాదంపై బీబీసీ స్పందన

BBC apologizes to Donald Trump over mis-edited January 6 speech documentary BBC apologizes to Donald Trump over mis-edited January 6 speech documentary

BBC apology to Trump:బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (BBC) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అధికారికంగా క్షమాపణలు తెలిపింది. 2021 జనవరి 6 ఘటనకు ముందు ట్రంప్ చేసిన ప్రసంగాన్ని పనోరమా డాక్యుమెంటరీలో తప్పుగా ఎడిట్ చేశామని బీబీసీ అంగీకరించింది.

అయితే, ట్రంప్ కోరిన”1 బిలియన్ డాలర్ల నష్టపరిహారం” చెల్లించే ఆలోచన తమకు లేదని సంస్థ స్పష్టం చేసింది.

పనోరమాలో ప్రసారమైన వీడియోలో ట్రంప్ మాట్లాడిన వేర్వేరు భాగాలను కలిపి ఒకే ప్రసంగంలా చూపించబడటంపై సంస్థ విచారం వ్యక్తం చేసింది. ఈ ఎడిటింగ్ పద్ధతి అతను హింసకు పిలుపు ఇచ్చినట్టు అపార్థం కలిగించిందనిBBC బాధ్యత స్వీకరించింది.

ఈ వివాదంతో బీబీసీ డైరెక్టర్–జనరల్ టీమ్ డేవి, న్యూస్ చీఫ్ డెబొరా టర్నెస్ రాజీనామాలు చేశారు.

ALSO READ:శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రెండో అతిపెద్ద కార్గో విమానం | Shamshabad Airport cargo plane

ట్రంప్ తరఫు న్యాయవాదులు భారీ ఆర్థిక నష్టం, ప్రతిష్ఠకు భంగం కలిగిందంటూ నష్టపరిహారం కోరినా, UK లేదా US కోర్టుల్లో ఈ కేసు గెలవడం కష్టమని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.

అంతకుముందు ఇతర అమెరికా మీడియా సంస్థల నుంచి ట్రంప్ భారీ సెటిల్‌మెంట్లు సాధించిన నేపథ్యంలో, ఈ కేసు ఎలా మలుపు తిరుగుతుందో ఆసక్తికరంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *