Patancheru road expansion | పటాన్చెరులో రహదారి విస్తరణ త్వరలో ప్రారంభం

Patancheru MLA Gudem Mahipal Reddy launches road expansion works

పటాన్ చెరు నుండి ఇంద్రేశం మీదుగా పెద్దకంజర్ల వరకు ప్రయాణించే ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో రహదారి విస్తరణ పనులు త్వరలో ప్రారంభమవనున్నాయని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.

గురువారం ఆయన పటాన్చెరు పరిధిలోని ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డు(ORR) నుండి ఇంద్రేశం మీదుగా పెద్దకంజర్ల వరకు రూ.60 లక్షల నిధులతో చేపట్టనున్న బీటీ ప్యాచ్ వర్క్ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ —ఇంద్రేశం, రామేశ్వరం బండ, పెద్దకంజర్ల, చిన్నకంజర్ల, ఐనోలు, బచ్చుగూడెం, పోచారం గ్రామాలతో పాటు నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని అనేక గ్రామాల ప్రజలు ఈ రహదారినే ప్రధాన మార్గంగా వినియోగిస్తున్నారని చెప్పారు.



గతంలో ఇంద్రేశం–పెద్దకంజర్ల రహదారి విస్తరణకు రూ.22 కోట్ల నిధులు కేటాయించినప్పటికీ, కొన్ని అనివార్య కారణాల వలన ఆ కేటాయింపులు రద్దు కావడం జరిగిందని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వంలోని మంత్రులతో చర్చలు జరిపి తిరిగి రహదారి అభివృద్ధి పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.


ప్రస్తుతం రూ.20 లక్షల ప్రభుత్వ నిధులతో బీటీ ప్యాచ్ వర్క్ పూర్తి చేసి, త్వరలో పూర్తి స్థాయి రహదారి విస్తరణ పనులు ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *