పండిన పంట చేతికి వస్తుంది అనుకునేలోపే మొంథా తుపాను(Montha Cyclone) రాష్ట్రవ్యాప్తంగా పంటలను బీభత్సంగా దెబ్బతీసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు చేసిన సర్వే ప్రకారం మొత్తం 1,22,242 మంది రైతులకు చెందిన 1,17,757 ఎకరాల్లో పంటలు(Crop Loss) నష్టపోయాయి.
వ్యవసాయ శాఖ అందించిన నివేదిక ప్రకారం, అత్యధికంగా వరి పంటలు 83,407 ఎకరాల్లో, పత్తి పంటలు 30,144 ఎకరాల్లో, మొక్కజొన్న 2,097 ఎకరాల్లో దెబ్బతిన్నాయి. నాగర్ కర్నూల్ జిల్లాలో 23,580 ఎకరాలు, వరంగల్ జిల్లాలో 19,736 ఎకరాల్లో ఎక్కువ నష్టం నమోదైంది.
ALSO READ:Delhi Red Fort blast:వెలుగులోకి వచ్చిన సీసీటీవీ ఫుటేజ్
మొత్తం రూ.117 కోట్ల 75 లక్షల రూపాయల పంట నష్టం జరిగిందని అధికారులు వెల్లడించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకారం, ఎన్డీఆర్ఎఫ్ నిబంధనల ప్రకారం రాష్ట్రానికి రూ.70 కోట్ల సహాయం లభించాలి.
తుపాను కారణంగా పంట నష్టం వివరాలు కేంద్రానికి పంపి, సహాయం కోరామని తెలిపారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10,000 చొప్పున పరిహారం చెల్లించడానికి ఏర్పాట్లు చేస్తోందని చెప్పారు.
