హైదరాబాద్లో ఉగ్రవాది అరెస్ట్ – సామూహిక విషప్రయోగం

Gujarat ATS arrests Hyderabad doctor in mass poisoning terror plot Gujarat ATS arrests Hyderabad-based Dr. Moinuddin in connection with a mass poisoning terror conspiracy

హైదరాబాద్లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. గుజరాత్ రాష్ట్ర ఏటీఎస్ బృందం ఉగ్రవాద కుట్రలో పాల్గొన్న డాక్టర్ “మొయినుద్దీన్” అనే వ్యక్తిని రాజేంద్రనగర్‌లో అరెస్ట్ చేసింది. సామూహిక విషప్రయోగం ద్వారా ప్రజలను హతమార్చే భయానక ప్రణాళిక వెనుక ఈ వ్యక్తి ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

సమాచారం ప్రకారం, ఉగ్రవాదులు “దేవాలయాలు మరియు వాటర్ ట్యాంకులలో “రెసిన్” అనే ప్రాణాంతక విషపదార్థం” కలపాలని ప్రణాళిక రచించారు.

ఈ కుట్ర ద్వారా సామూహిక హత్యలు జరపాలని యత్నించినట్లు గుజరాత్ ఏటీఎస్ వెల్లడించింది.

also read:అమలాపురం బాలిక మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు

మొయినుద్దీన్‌తో పాటు మరో నలుగురిని ఇప్పటికే గుజరాత్ ఏటీఎస్ అరెస్ట్ చేసింది. వీరందరూ ఒకే మాడ్యూల్‌లో పనిచేసినట్లు, దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విషప్రయోగ దాడుల కోసం సన్నాహాలు చేసినట్లు దర్యాప్తులో బయటపడింది.

ప్రస్తుతం నిందితుడిని గుజరాత్‌కు తరలించి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *