Tuesday, April 7, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshKurnool:కర్నూలు జిల్లాలో హృదయవిదారక ఘటన -ప్రభుత్వ ఆసుపత్రిలో పసిబిడ్డను వదిలేసిన తల్లి 

Kurnool:కర్నూలు జిల్లాలో హృదయవిదారక ఘటన -ప్రభుత్వ ఆసుపత్రిలో పసిబిడ్డను వదిలేసిన తల్లి 

-

Chat on WhatsApp

కర్నూలు జిల్లా నందికొట్కూరు పట్టణంలోని సాయిబాబా పేటలో ఓ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. కొణిదెల గ్రామానికి చెందిన శివమ్మ ఉదయం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

కానీ అనంతరం కుటుంబ సమస్యల కారణంగా శివమ్మ చిన్నమ్మ శేషమ్మ పసిబిడ్డను ఆసుపత్రిలో వదిలేసి వెళ్లిపోయింది. ఈ ఘటనతో ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు ఆందోళన చెందారు. వెంటనే వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు.

సూచన అందుకున్న నందికొట్కూరు మహిళా పోలీసులు చురుగ్గా స్పందించి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా శేషమ్మను గుర్తించి తక్కువ సమయంలోనే ఆమెను కనుగొన్నారు.

అనంతరం పసిపాపను సురక్షితంగా తల్లి శివమ్మ వద్దకు చేర్చారు.స్థానిక ప్రజలు మహిళా పోలీసుల వేగవంతమైన చర్యలను ప్రశంసించారు.

ఒకవైపు నిర్లక్ష్యంతో పసిపాపను వదిలేసిన ఘటన విచారం కలిగించగా, మరోవైపు పోలీసులు చూపిన మానవతా హృదయం అందరినీ మెప్పించింది.

Also Read: జగిత్యాల జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సు ఓవర్‌లోడ్-తృటిలో తప్పిన పెను ప్రమాదం



- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

rajnath singh warning pakistan over bengal and kolkata threat

Rajnath Singh | 1971 యుద్ధాన్ని గుర్తు చేసిన రాజ్‌నాథ్…వార్నింగ్ ఇస్తూ…చరిత్ర రిపీట్ అవుద్ది

Rajnath Singh: పాకిస్థాన్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ కోల్‌కతాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై భారత రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. “బెంగాల్‌పై కన్నేస్తే, ఈసారి పాకిస్థాన్ ఎన్ని ముక్కలవుతుందో...
- Advertisement -
Chat on WhatsApp