Thursday, July 30, 2026
Chat on WhatsApp
HomeOthersసూట్‌కేస్‌లో గర్ల్‌ఫ్రెండ్‌ను హాస్టల్‌కి తీసుకెళ్లే యత్నం!

సూట్‌కేస్‌లో గర్ల్‌ఫ్రెండ్‌ను హాస్టల్‌కి తీసుకెళ్లే యత్నం!

-

Chat on WhatsApp

హర్యానాలోని సోనిపట్‌లో ఉన్న ఓపీ జిందాల్ విశ్వవిద్యాలయంలో అబ్బాయి ఓ అసాధారణ యత్నం చేశాడు. తన గర్ల్‌ఫ్రెండ్‌ను బాలుర హాస్టల్‌లోకి తీసుకెళ్లాలని భావించి, ఆమెను పెద్ద సూట్‌కేస్‌లో ప్యాక్ చేశాడు. ఆ తర్వాత ఆ సూట్‌కేస్‌తో హాస్టల్‌కి వెళ్లాడు.

హాస్టల్‌ వద్ద గార్డులకు అతడి ప్రవర్తనపై అనుమానం రావడంతో లగేజ్‌ను చెక్ చేశారు. సూట్‌కేస్‌ను ఓపెన్ చేయగానే అందులో యువతి కనిపించడంతో అధికారులు షాక్‌కు గురయ్యారు. వెంటనే ఆమెను బయటకు తీసి అక్కడి వారందరూ నిర్ఘాంతపోయారు.

ఈ ఘటనను అక్కడే ఉన్న ఇతర విద్యార్థులు వీడియో తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో క్షణాల్లో వైరల్ అయింది. ఈ ఘటనపై నెటిజన్లు తమదైన శైలిలో రియాక్ట్ అవుతున్నారు. కొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తుండగా, మరికొందరు హాస్టల్ భద్రతపై ప్రశ్నలు వేస్తున్నారు.

ఇదంతా జరిగినా ఇప్పటివరకు విశ్వవిద్యాలయం అధికారికంగా స్పందించలేదు. ఆ విద్యార్థిపై చర్యలు తీసుకున్నారా లేదా అన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయితే, ఇలాంటి సంఘటనలు భద్రతా చర్యలపై మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Ayodhya Ram Mandir

Ayodhya Ram Mandir Trust  | రామమందిర ట్రస్ట్‌లో కీలక మార్పులు.. ఐఐటీ మాజీ విద్యార్థికి...

Ayodhya Ram Mandir Trust:  శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్వహణలో కీలక అడుగు వేసింది. ట్రస్ట్ తొలి కార్యదర్శిగా ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థి జగదీశ్ అఫాలేను నియమించింది. ఆలయ పరిపాలనతో పాటు ఆర్థిక...
- Advertisement -
Chat on WhatsApp