టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత చాలా కాలం తర్వాత స్టేజ్ పై లైవ్ డ్యాన్స్ చేసి అభిమానులను అలరించారు. ఆమె తాజాగా నిర్మించిన మొదటి సినిమా ‘శుభం’ మే 9న విడుదల కాబోతోంది. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సమంత అతిథి పాత్రలో కనిపించనున్నారు. నిర్మాతగా ఆమె మొదటి అడుగు వేయడం ప్రత్యేకత.
శనివారం సాయంత్రం విశాఖపట్నంలో జరిగిన ‘శుభం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ grand గా జరిగింది. ఈ ఈవెంట్‌లో సమంతతో పాటు ప్రధాన తారాగణం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ, “వైజాగ్‌లో ఈవెంట్స్ చేసిన నా సినిమాలన్నీ హిట్ అయ్యాయి. శుభం కూడా విజయవంతమవుతుందని నమ్మకం ఉంది” అని చెప్పారు. “మజిలీ, ఓ బేబీ, రంగస్థలం ఈవెంట్స్ కూడా ఇక్కడే జరిగాయి” అని పేర్కొన్నారు.
ఈవెంట్‌లో సమంత స్టేజ్ పై డ్యాన్స్ చేస్తూ అభిమానులను అలరించారు. ‘శుభం’ సినిమాలోని ఒక పాటకు ఆమె స్టెప్పులు వేసి సందడి చేశారు. ఆమెతో పాటు ఇతర నటీనటులు కూడా డ్యాన్స్ చేశారు. ఈ వేడుకలో సమంత భావోద్వేగానికి లోనై తన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు.
‘శుభం’ సినిమాలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రీయ కొంతం, శ్రావణి లక్ష్మిలు ముఖ్య పాత్రలు పోషించారు. ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా విడుదలపై మంచి అంచనాలు నెలకొన్నాయి. సమంత నిర్మాతగా నూతన ప్రస్థానం ప్రారంభించడంతో ఈ చిత్రం ఆమెకు ప్రత్యేకమైనదిగా మారింది.
