మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని నేడు పట్టణంలోని మల్లె చెరువు కట్ట వద్ద విశ్వకర్మ మనుమయ సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ భగవాన్ చిత్రపటానికి పూలమాలు వేసి, విశ్వకర్మ జెండాను ఎగరవేసి ఘనంగా జయంతి ఉత్సవాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా విశ్వకర్మ మనమయ సంఘం మండల అధ్యక్షులు కొడపర్తి లక్ష్మణాచారి, పట్టణ అధ్యక్షుడు కమ్మరి యాదగిరి చారి మాట్లాడుతూ విశ్వకర్మలకు ప్రతి జిల్లాలో కార్పొరేషన్ భవన్ ఏర్పాటు చేయాలని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం విశ్వకర్మలకు ప్రత్యేక ప్యాకేజీని కల్పించాలని పేర్కొన్నారు.అదేవిధంగా విశ్వకర్మ కుటుంబాల్లో ఉన్నటువంటి నిరుపేద వృద్ధులకు 55 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
నిరుపేద విశ్వకర్మలకు అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించాలని తెలిపారు. అలాగే విశ్వకర్మ భగవాన్ గుడి నిర్మాణాలకు ప్రభుత్వము నిధులు కేటాయించాలని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విశ్వకర్మలు అందరూ గ్రామ గ్రామాన విశ్వకర్మ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.
అలాగే విశ్వకర్మ భగవాన్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు.ఈ కార్యక్రమంలో విశ్వకర్మ మనమయ సంఘం మండల అధ్యక్షులు కొడపర్తి లక్ష్మణాచారి, పట్టణ అధ్యక్షుడు కమ్మరి యాదగిరి చారి, గౌరవ అధ్యక్షులు ఉమ్మడి రాములు చారి, ఉపాధ్యక్షులు కోడపర్తి పాండు చారి,ప్రధాన కార్యదర్శి కొడపర్తి నరేందర్ చారి, సహాయ కార్యదర్శి కమ్మరి వెంకటరాములు చారి, సలహాదారులు కమ్మరి చంద్రమౌళి చారి,సంఘ సభ్యులు పాల్గొన్నారు.