తమిళనాడు రాష్ట్రం అవడి ప్రాంతంలో ఓ దారుణ హత్య కలకలం రేపింది. స్థానిక కౌన్సిలర్‌గా పనిచేస్తున్న మహిళను ఆమె భర్త స్టీఫెన్ రాజు క్రూరంగా హత్య చేశాడు. ఆమె మరో వ్యక్తితో మాట్లాడుతున్న సందర్భాన్ని చూసిన స్టీఫెన్ రాజు ఆగ్రహానికి లోనయ్యాడు. కోపంతో ఊగిపోయిన అతడు ఆమెపై దాడికి దిగాడు. దారుణంగా మోచేయి కోసి, తీవ్ర గాయాలతో కౌన్సిలర్ అక్కడికక్కడే మరణించారు. ప్రజలు ఘటనను చూసి షాక్‌కి గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్టీఫెన్ రాజును అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, భార్యపై గతకొంతకాలంగా స్టీఫెన్‌కు అనుమానాలు ఉండేవని తెలిసింది. వ్యక్తిగత విభేదాలే ఈ ఘాతుకానికి దారితీసినట్లు అనుమానిస్తున్నారు.
మరో వ్యక్తితో మాట్లాడినందుకు భార్యను హత్య చేసిన భర్త
