పెద్దమ్మ తల్లి ఆశీర్వాదంతో అందరూ బాగుండాలి అని ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి అన్నారు
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం దాచారం గ్రామంలో గురువారం శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం వైభవంగా నిర్వహించారు, పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, మాజీ ఎఫ్ డీ సీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, పెద్దమ్మ తల్లి విగ్రహ దాత ఆర్యవైశ్య సీనియర్ నాయకులు కొమురవెళ్లి సుధాకర్ మాట్లాడుతూ పెద్దమ్మతల్లి ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని, సకాలంలో వర్షాలు కురిసి సమృద్ధిగా పంటలు పండాలని, అందరూ సంతోషంగా ఉండాలని పెద్దమ్మ తల్లిని వేడుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గోపాల్ రెడ్డి, కొండ పోచమ్మ దేవస్థానం మాజీ డైరెక్టర్ నిమ్మ రమేష్,లయన్ దొంతుల సత్యనారాయణ, ముదిరాజ్ కులస్తులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు