Friday, February 20, 2026
spot_img
HomeAndhra Pradeshనా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే ఏంటి? పోతే ఏంటి?..నా అన్వేషణ సంచలన కామెంట్స్

నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే ఏంటి? పోతే ఏంటి?..నా అన్వేషణ సంచలన కామెంట్స్

Naa Anveshana Instagram Ban: ‘నా అన్వేషణ’ పేరుతో ప్రసిద్ధి చెందిన యూట్యూబర్ అన్వేష్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను మెటా తొలగించడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో అన్వేష్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. “నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే ఏంటి? పోతే ఏంటి? అది నా ఈకతో సమానం” అంటూ విమర్శకులకు కౌంటర్ ఇచ్చారు.

తన సోషల్ మీడియా వేదికలను శరీర భాగాలతో పోలుస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “రెండు ఇన్‌స్టాగ్రామ్‌లు నా రెండు చేతులు, రెండు యూట్యూబ్ ఛానెల్లు నా రెండు కాళ్లు, ఫేస్‌బుక్ నా శరీరం… ఇవన్నీ నడిపించేది నా తెలివైన తల” అని అన్నారు. ఒక అకౌంట్ పోయినా మరోదితో ముందుకు సాగుతానని స్పష్టం చేశారు.

తనపై విమర్శలు చేసే వారికి హెచ్చరికలు జారీ చేస్తూ, “నేను ఎవరినీ మోసం చేయలేదు. ఫాలోవర్లు ఉన్నా లేకపోయినా నేను ఆగను” అని అన్నారు. అవసరమైతే తలతో అయినా మాట్లాడి ముందుకు వెళ్తానని ధైర్యంగా చెప్పారు. ఇన్‌స్టాగ్రామ్ బ్యాన్ తనపై ప్రభావం చూపదని, యూట్యూబ్ ద్వారా నెలకు సుమారు రూ.8 లక్షల ఆదాయం వస్తోందని వెల్లడించారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular