Saturday, April 11, 2026
Chat on WhatsApp
HomeTelanganaతెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాల హెచ్చరిక

తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాల హెచ్చరిక

-

Chat on WhatsApp

తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేటి నుంచి ఎల్లుండి వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

ఈ నెల 3వ తేదీ నుంచి 4వ తేదీ ఉదయం వరకు కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షం కురిసే అవకాశముందని తెలిపింది.

కొమురంభీమ్ ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని తెలిపింది.

ఈ నెల 4వ తేదీ నుంచి 5వ తేదీ వరకు కొమురంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

కొమురంభీమ్ ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని తెలిపింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

PM Modi addressing a public rally in West Bengal during election campaign

PM Modi | ఆడబిడ్డల భద్రత పై మోడీ ధ్వజం .. ఎన్నికల ప్రసంగంలో...

PM Modi: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో ఆడబిడ్డలకు భద్రత లభిస్తుందని ఆయన అన్నారు. పూర్బ బర్ధమాన్,...
- Advertisement -
Chat on WhatsApp