Friday, April 10, 2026
Chat on WhatsApp
HomeTelanganaHyderabadజోడో యాత్రతో మైనార్టీలకు రాహుల్‌ గాంధీ భరోసా ఇచ్చారు – సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు

జోడో యాత్రతో మైనార్టీలకు రాహుల్‌ గాంధీ భరోసా ఇచ్చారు – సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు

-

Chat on WhatsApp

HYD:జోడో యాత్ర ద్వారా దేశంలోని మైనార్టీలకు రాహుల్‌ గాంధీ భరోసా ఇచ్చారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. జూబ్లీహిల్స్‌ క్రైస్తవ సంఘాల ప్రతినిధులు బుధవారం ఆయనను కలిశారు.

తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లిన ప్రతినిధులకు రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించిన పాస్టర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

సీఎం మాట్లాడుతూ, “భారత రాష్ట్ర సమితిని కేసీఆర్‌ భాజపాకు తాకట్టుపెట్టారు.జూబ్లీహిల్స్‌లో మైనార్టీలను మభ్యపెట్టేందుకు కుట్ర జరుగుతోంది. కాళేశ్వరం కేసు సీబీఐకి వెళ్లి మూడు నెలలు అయినా స్పందన లేదు.

ఫార్ములా ఈ-కార్‌ రేస్‌ కేసులో కేటీఆర్‌ అరెస్టుకు గవర్నర్‌ అనుమతి ఇవ్వడం లేదు. భాజపా, బీఆర్ఎస్‌ మధ్య ఒప్పందం లేకుంటే ఎందుకు అనుమతివ్వరు?”అని ప్రశ్నించారు.

రేవంత్‌రెడ్డి మరింతగా మాట్లాడుతూ, “భాజపాలో బీఆర్ఎస్‌ విలీనం అయ్యే పరిస్థితి ఉంది. కవిత స్వయంగా గతంలోనే ఈ విషయం వెల్లడించారు. జూబ్లీహిల్స్‌ను ఈ రాజకీయ కుమ్మక్కు ప్రయోగశాలగా మార్చారు” అని తీవ్ర విమర్శలు చేశారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Sensex surges 918 points as Indian stock markets close with strong gains

Stock market | బ్యాంకింగ్ షేర్ల జోరు.. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ముగింపు

Stock market: దేశీయ షేర్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. బ్యాంకింగ్ రంగం నుంచి వచ్చిన బలమైన కొనుగోళ్లు, అంతర్జాతీయ మార్కెట్లలో కనిపించిన సానుకూల సంకేతాలు మార్కెట్‌కు బలాన్ని అందించాయి. దీంతో సెన్సెక్స్...
- Advertisement -
Chat on WhatsApp