హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఇవాళ ఉదయం ఓ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చౌటుప్పల్ వద్ద మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనతో రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ స్థంభించింది. ప్రమాదానికి కారణం ముందుగా వెళ్తున్న కారు సడన్‌గా బ్రేక్ వేయడం వలన ప్రమాదం జరిగింది అని పోలీసులు తెలిపారు. వెనుక వస్తున్న కార్లు వేగంగా రావడం తో ఒకదానికొకటి ఢీకొన్నాయి. తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది అని చెప్పారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఘటనాస్థలానికి పోలీసులు చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని హెచ్చరిస్తున్నారు.
చౌటుప్పల్ వద్ద మూడు కార్లు ఢీ
