సెప్టెంబర్ 15న అఖిల భారతీయ గో ఫౌండేషన్ ఆధ్వర్యంలో గో భక్తుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ఫౌండేషన్ అధ్యక్షులు బాలకృష్ణ గురుస్వామి మాట్లాడుతూ గోరక్షణ, భూ రక్షణ, పర్యావరణ రక్షణపై చైతన్యం తీసుకువచ్చేందుకు పాదయాత్ర చేపట్టినట్టు తెలిపారు.
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 14 రాష్ట్రాలు, 4900 కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా ప్రజలలో అవగాహన పెంచుతున్నారు.
సేవ్ కౌ, సేవ్ ఎర్త్, సేవ్ ఎన్విరాన్మెంట్ అంటూ ప్రజలకు సందేశం అందిస్తున్నారు.ఈ పాదయాత్రలో ఆయా రాష్ట్రాలలోని రాజకీయ నాయకులను, వర్క్ షాప్ మినిస్ట్రీని కలుస్తున్నారు.
భువనేశ్వరి పీఠం అధిపతులు కమలానంద భారతి స్వామీజీ, సినీ హీరో తల్వార్ సుమన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రకృతి వ్యవసాయ నిపుణులు విజయరామ్, ఫౌండేషన్ సభ్యులు, స్వామీజీలు, గో భక్తులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఫౌండేషన్ అధ్యక్షులు బాలకృష్ణ గురుస్వామి, పాదయాత్ర విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.