అట్టహాసంగా శోభాయాత్ర కామారెడ్డిలో రెండు రోజుల పాటు జరగనుంది. నిమజ్జనం జరిగే జిల్లాకేంద్రం టేక్రియాల్ శివారులోని అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు వద్ద పురపాలక యంత్రాంగం సౌకర్యాలు ఏర్పాట్లు చేసింది. పురపాలక , పోలీసు , రెవెన్యూ శాఖల సమన్వయంతో నిమజ్జనాన్ని ప్రశాంతంగా ముగించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గడ్డమీద ప్రియా మాట్లాడుతూ: కామారెడ్డి జిల్లాకేంద్రంలో సోమవారం రాత్రి వినాయక నిమజ్జన శోభాయాత్ర ధర్మశాల వద్ద ప్రారంభం కానుంది. అక్కడి నుంచి సిరిసిల్లరోడ్డు , ఇందిరాచౌక్ వద్దకు చేరుకుంటుంది. ఉత్సవ సమితి ఆధ్వర్యంలో యాత్రలో వచ్చే గణనాథులకు స్వాగతం పలుకుతారు. అక్కడి నేడు గణేశ్ శోభాయాత్ర
గణనాథులకు స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి స్టేషన్ రోడ్డు , సుభాష్ రోడ్డు వీక్లీమార్కెట్ రోడ్డు , వేణుగోపాల్స్వామిరోడ్డు , పెద్దబజార్ మీదుగా రైల్వేకమాన్కు చేరుకుంటుంది. అక్కడి నుంచి బాలుర ఉన్నత పాఠశాల, నిజాంసాగర్ చౌరస్తా వరకు యాత్ర సాగనుంది. టేక్రియాల్ సమీపంలోని అడ్లుర్ ఎల్లారెడ్డికి చెరువుకు నిమజ్జనానికి తరలించనున్నారు. జాతీయ రహదారి , కొత్తబస్టాండు మీదుగా యాత్ర కొనసాగనుంది. డిగ్రీ కళాశాల ఎదురుగా జాతీయ రహదారి మీదుగా టేక్రియాల్ చౌరస్తా నుంచి అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు వరకు శోభాయాత్ర సాగనుంది. శోభాయాత్రలో 450కి పైగా వినాయక విగ్రహాలు ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై ముందుకు తరలనున్నాయి అన్నారు. ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మున్సిపల్ యంత్రాంగం మరమ్మతులు చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో విద్యుత్తు తీగలు విగ్రహాలకు అడ్డురాకుండా ట్రాన్స్కో యంత్రాంగం చర్యలు తీసుకుందని. పోలీసుశాఖ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎస్పీ సింధూశర్మ ఆధ్వర్యంలో ఏఎస్పీ, ముగ్గురు 3 డీఎస్పీలు , 10 మంది సీఐలు, 20 మంది ఎస్సైలు , సివిల్ పోలీసులు 250 మంది , రిక్రూట్ పోలీసులు 80 , ఎన్సీసీ సిబ్బంది , హోంగార్డుల సేవలను వినియోగిస్తున్నారని సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రతి కదలికను నమోదు చేయనున్నారు తెలిపారు.