ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఆ దేశ గగనతలాన్ని ఉపయోగించడాన్ని విమానయాన సంస్థలు నివారిస్తున్నాయి. పాసింజర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల కొన్నివిమానాల ప్రయాణ సమయం పెరగనుంది. కానీ ప్రయాణికుల భద్రతే ప్రథమ లక్ష్యంగా సంస్థ వ్యవహరిస్తోంది.ఇరాన్ గగనతలాన్ని దాటి వెళ్తున్న ఢిల్లీ – లండన్, ఢిల్లీ – టొరంటో, ముంబయి – అమెరికా రూట్లపై ప్రభావం పడినట్లు సమాచారం. యాత్రాప్రణాళికల్లో ప్రయాణికులు మార్పులు చేసుకోవలసిన అవసరం ఉందని అధికారులు సూచిస్తున్నారు.ప్రస్తుతం పలు అంతర్జాతీయ విమానయాన సంస్థలు కూడా ఇరాన్ గగనతలాన్ని తప్పించుకుని ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణిస్తున్నాయి. పరిస్థితిని సమీక్షిస్తూ ఎయిర్ ఇండియా నిర్ణయాలను తాజాగా తీసుకుంటుంది.ఇటువంటి పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు అధికారిక సమాచారం కోసం ఎయిర్ ఇండియా వెబ్‌సైట్ లేదా సంబంధిత విమానాశ్రయ అధికారులతో సంప్రదించాల్సిందిగా యాత్రికులకు విజ్ఞప్తి.
ఇరాన్ గగనతలం మూసివేత: ఎయిర్ ఇండియా 16 విమానాలకు షాక్
ఇరాన్ గగనతలంపై టెన్షన్
