Snake News: పాము కనిపిస్తే సాధారణంగా ప్రజలు భయంతో దూరంగా తప్పుకుంటారు. అయితే ఇటీవల ఒక మహిళ ధైర్యంగా పామును పట్టుకునే ప్రయత్నంలో ప్రమాదానికి గురైన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్రామంలోని పొదల్లో దాగి ఉన్న పామును చూసి స్థానికులు భయపడినా, చీరకట్టులో ఉన్న ఒక మహిళ ముందుకు వచ్చి పామును బయటకు తీశారు.
అది సంచిలో వేయడానికి ప్రయత్నించే సమయంలో, పాము అకస్మాత్తుగా ఆమె బుగ్గపై కాటు వేసింది. భయంతో కేకలు వేశినా, పాము కొంతసేపు ఆమె చెంపపై పట్టుకొని ఉండడం అక్కడివారిని షాక్‌కు గురి చేసింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది.
ALSO READ:Telangana Global Summit: 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ దిశగా అడుగులు
పాము తోకను పట్టుకోవడం అత్యంత ప్రమాదకరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అనుభవం లేకుండా ఇలా ప్రయత్నించడం ప్రాణాపాయ పరిస్థితులకు దారితీస్తుందన్నారు. “పాములతో వ్యవహరించడం చిన్నపిల్లల ఆట కాదు,” “ఇలాంటి పనులు శిక్షణ పొందినవారే చేయాలి” అంటూ నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు.
పాములను పట్టుకోవాలంటే తగిన జాగ్రత్తలు, శిక్షణ, భద్రత తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు.
