Whatsapp New Feature: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగించే ప్రముఖ మెసేజింగ్ యాప్ “whatsapp” మరో సరికొత్త ఫీచర్‌ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇకపై యూజర్లు ప్రతి మెసేజ్‌ను విడిగా చదవాల్సిన అవసరం లేకుండా, చదవని చాట్స్‌లోని ముఖ్యమైన విషయాలను “ai ఆధారిత ప్రైవేట్ సమ్మరీ” రూపంలో తెలుసుకునే అవకాశం పొందనున్నారు.
ప్రస్తుతం ఈ ఫీచర్ “android whatsapp beta version“లో కనిపించినప్పటికీ, ఇంకా అభివృద్ధి దశలోనే ఉండటంతో సాధారణ వినియోగదారులకు అందుబాటులోకి రాలేదు.
ఈ ఫీచర్ ముఖ్యంగా “గ్రూప్ చాట్స్” లో ఎక్కువ మెసేజ్‌లు వచ్చినప్పుడు ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. యూజర్లు తమకు చదవని చాట్స్‌ను ఎంపిక చేసుకుని, వాటికి ఒకేసారి summaryని జనరేట్ చేసుకోవచ్చు. దీంతో పెద్ద పెద్ద చాట్‌లను పూర్తిగా చదవకుండానే అందులోని ప్రధాన అంశాలను తక్కువ సమయంలో అర్థం చేసుకోవచ్చు.
ఈ కొత్త సౌకర్యం “meta” రూపొందించిన “private processing technology” పై ఆధారపడి పనిచేస్తుంది. whatsapp తెలిపిన వివరాల ప్రకారం, యూజర్ మెసేజ్‌లు లేదా వాటి సమ్మరీలను meta లేదా whatsapp కూడా చూడలేని విధంగా ఈ టెక్నాలజీ రూపొందించబడింది. అంటే, యూజర్ల గోప్యతకు ఎలాంటి భంగం కలగకుండా భద్రతతో ఈ ఫీచర్ పని చేయనుంది.
అదనంగా, ఈ ఫీచర్ పూర్తిగా “optional” గానే ఉండనుంది. అంటే యూజర్‌కు అవసరమైతేనే దీన్ని ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు, “private processing” డిఫాల్ట్‌గా “off”లో ఉంటుంది. ఈ ai సమ్మరీలను వాడాలంటే యూజర్లు తమ settingsలోకి వెళ్లి స్వయంగా ఈ ఫీచర్‌ను ఆన్ చేయాలి. మొత్తంగా చూస్తే, whatsapp తీసుకురాబోతున్న ఈ కొత్త ఫీచర్ వినియోగదారుల చాట్ అనుభవాన్ని మరింత వేగవంతంగా, సులభంగా మార్చే అవకాశం ఉంది.
Whatsapp New Feature | మెసేజ్‌లు ఎక్కువైనా టెన్షన్ లేదు.. whatsappలో ai సమ్మరీ ఫీచర్
-








