Saturday, March 21, 2026
Google search engine
HomeInterNationalవిరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా మిస్సింగ్.. హ్యాకింగ్ భయంతో ఫ్యాన్స్ ఆందోళన

విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా మిస్సింగ్.. హ్యాకింగ్ భయంతో ఫ్యాన్స్ ఆందోళన

-

Google search engine

Virat Kohli Instagram account: సోషల్ మీడియాలో కింగ్ విరాట్ కోహ్లీ సామ్రాజ్యం ఒక్కసారిగా కూలిపోయిందా? అన్న అనుమానం కోట్లాది మంది అభిమానులను కలవరపెట్టింది. శుక్రవారం తెల్లవారుజామున టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి చెందిన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా అకస్మాత్తుగా కనిపించకుండా పోవడంతో ఇంటర్నెట్‌లో పెను సంచలనం నెలకొంది.

274 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్న @virat.kohli అకౌంట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తే “పేజీ అందుబాటులో లేదు” అనే సందేశం రావడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

హ్యాకింగ్ జరిగిందా? లేక కోహ్లీ స్వయంగా అకౌంట్‌ను డియాక్టివేట్ చేశారా? అన్న అనుమానాలతో సోషల్ మీడియా వేదికగా చర్చలు జోరందుకున్నాయి. కోహ్లీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అభిమానులు ఆయన భార్య అనుష్క శర్మ ఇన్‌స్టాగ్రామ్ పేజీపైకి వెళ్లి కామెంట్ల వర్షం కురిపించారు. “విరాట్ అకౌంట్ ఏమైంది?”, “ఎందుకు ఓపెన్ కావడం లేదు?” అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదే సమయంలో కోహ్లీ ఫామ్ పరంగా పీక్‌లో ఉండటం, ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో మళ్లీ నంబర్ వన్‌గా నిలవడం ఈ ఘటనపై మరింత ఆసక్తి పెంచింది. చివరకు కొన్ని గంటల ఉత్కంఠ తర్వాత కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తిరిగి పునరుద్ధరించబడింది.

ఇది సాంకేతిక లోపమా? లేక డిజిటల్ డిటాక్స్ కోసమా? అన్నది స్పష్టత లేకపోయినా, కోహ్లీ అకౌంట్ తిరిగి రావడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటనతో కింగ్ కోహ్లీ సోషల్ మీడియాలో ఎంతటి క్రేజ్ కలిగి ఉన్నాడో మరోసారి రుజువైంది.

also read:సునేత్రా పవార్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి? మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త మలుపు

- Advertisement -
Google search engine
- Advertisment -
Google search engine

Must Read

telangana high court hearing plea challenging speaker decision on danam nagender disqualification case

Danam Nagender | హైకోర్టులో ఎమ్మెల్యే దానం పార్టీ ఫిరాయింపు కేసు…స్పీకర్ నిర్ణయానికి సవాల్

Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వివాదం ఇప్పుడు తెలంగాణ హైకోర్టు వరకు చేరడంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది. దానం నాగేందర్ పార్టీ మారలేదని తెలంగాణ అసెంబ్లీ...
- Advertisement -
Google search engine