ఏపీ బీసీ ఓబీసీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్, ఆంధ్ర ప్రదేశ్ వారి సారథ్యం లో నిన్న అనగా తేది 19.12. 2024 తారీకున సాయంత్రం ఏడు గంటలకు విజయవాడ క్లబ్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ మంత్రులందరికీ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్యశాఖ మాత్యులు వై సత్య కుమార్ యాదవ్ గారు మాట్లాడుతూ బీసీలందరూ ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అని, మహాత్మ జ్యోతిరావు ఫూలే కలల కన్నా సమాజాన్ని నిర్మించవచ్చని, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించే లాగా రాజ్యాంగాన్ని ఏర్పాటు చేశారని తద్వారా బీసీలకు వారి హక్కులు పొందడానికి వీలు కలిగిందని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారిని కొనియాడారు, అమరావతి లోనే మహాత్మ జ్యోతీరావు ఫూలే మరియు అమ్మ సావిత్రిబాయి పూలే స్మారక వనాన్ని ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నాలు చేస్తామని మరియు మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఏప్రిల్ 11వ తారీఖున సెలవు దినంగా ప్రకటించడానికి ప్రయత్నం చేస్తామని , హామీ ఇచ్చారు, ఈ కార్యక్రమంలో గౌరవ బీసీ సంక్షేమ శాఖ మాత్యులు శ్రీమతి ఎస్. సవిత గారు మాట్లాడుతూ బీసీలు ఐక్యంగా ఉండి రాజ్యాధికారం వైపు ప్రయాణం చేయాలని ఐక్యంగా ఉండాలని కోరారు. అలాగే మొదటిసారిగా బీసీలకు రాజ్యాధికారాన్ని అందించిన వ్యక్తి డాక్టర్ నందమూరి తారక రామారావు గారే అని అలాగే నేటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు ద్వారా తామంతా మంత్రులుగా ఏర్పాటు చేయబడ్డామని టిడిపి పార్టీకి మరియు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
టిడిపి పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి బీసీల ఓట్లు కీలకమైనవని , బీసీలందరూ తమ ఓట్లు టిడిపి పార్టీకి వేయటం ద్వారా పార్టీ అధికారంలోకి వచ్చిందని , బీసీలంతా టిడిపి పార్టీ వెనుక ఉన్నారని నిరూపించుకున్నారని ఈ సందర్భంగా బీసీ సమాజానికి కృతజ్ఞతలు తెలియజేశారు,
ఇదే ఐక్యతను బీసీల లందరు కనబరుస్తూ రాబోయే కాలంలో మరింతగా అభివృద్ధి చెందాలని కోరుకొన్నారు , ప్రతి ఉద్యోగి బిసి విద్యార్థులు దత్తత తీసుకుని వారు మరింతగా అభివృద్ధి చెందేలాగా మంచి భవిష్యత్తు కలిగి ఉండేలాగా తీర్చిదిద్దాలని సూచించారు, ఈ కార్యక్రమంలో గౌరవ శ్రీ వి. సుభాష్ గారు కార్మిక శాఖ మాత్యులు మాట్లాడుతూ బీసీ అని చెప్పుకోవాడానికి భయపడే స్థాయి నుంచి బీసీ అని గర్వంగా చెప్పుకునే స్థాయికి నిలబెట్టినటువంటి బీసీ సమాజానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో గౌరవ శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు MSME serp NRI empowerment రిలేషన్స్ మంత్రివర్యులు
వారు మాట్లాడుతూ బీసీ ఎంప్లాయిస్ సమస్యలు ,, వారిచ్చిన మెమోరాండంలోని విషయాలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెలతాననీ హామీ ఇచ్చారు, ఈ కార్యక్రమంలో ఏపీ బీసీ ఓబీసీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ పి అర్ విఠల్ కుమార్ గారు మాట్లాడుతూ మహాత్మ జ్యోతి రావు ఫూలే పర్వదినాన్ని సేలవు దినంగా ప్రకటించాలని
ప్రతి జిల్లాలోనూ మహాత్మ జ్యోతిరావు పూలే స్మారక వనాన్ని నిర్మించాలని అలాగే బీసీ భవనములు ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలని అదే విధంగా బీసీ ఎంప్లాయిస్ కి ప్రతి జిల్లాలో ఆఫీస్ ఏర్పాటు చేసుకోవడానికి స్థలాన్ని కేటాయించాలని మంత్రివర్యులును కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ ఎంప్లాయిస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జి. వీరబ్రహ్మం మాట్లాడుతూ బీసీలo తా ఐక్యంగా ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ ఎంప్లాయిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శలు పి భూషణ రావు, పి. శ్రీధర్, కన్వీనర్ పామర్తి యేసు రాజు , కోశాధికారి వై. శంకర రావు , అసోసియేట్ అధ్యక్షులు కేదారేశ్వర రావు , రాష్ట్ర ఉపాధ్యక్షులు
ఎం.
రంగనాయకులు , బలివాడ బాల భాస్కర రావు ,
R, ప్రసాద్ గారు మొదలగు రాష్ట్ర నాయకులు మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరితోపాటు వివిధ జిల్లాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు అనేకమంది బీసీ ఎంప్లాయిస్ సభ్యులు పాల్గొన్నారు.
బీసీ మంత్రుల సన్మానంలో ఐక్యత ప్రాముఖ్యత
