Thursday, March 26, 2026
Chat on WhatsApp
HomeNationalUnion Budget 2026: ట్యాక్స్ పేయర్లకు పెద్ద ఊరట?.. టాప్ 13 మార్పులు

Union Budget 2026: ట్యాక్స్ పేయర్లకు పెద్ద ఊరట?.. టాప్ 13 మార్పులు

-

Chat on WhatsApp

Union Budget 2026: ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యూనియన్ బడ్జెట్ 2026ను ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే ఎనిమిది సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆమె, తొమ్మిదవసారి సభ ముందుకు రానున్న నేపథ్యంలో పన్ను చెల్లింపుదారుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

గత బడ్జెట్‌లో కొన్ని పన్ను సడలింపులు ఇచ్చిన ప్రభుత్వం, ఈసారి పెద్ద ఎత్తున పన్ను రేట్ల కోతలు ఉండకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అయితే రేట్లు తగ్గించకపోయినా, పన్ను నిబంధనల సరళీకరణ ద్వారా మధ్యతరగతి వారికి ఊరట కల్పించే అవకాశం ఉందని మరో వర్గం చెబుతోంది. వ్యక్తిగత ఆదాయపు పన్ను, మినహాయింపులు, డిడక్షన్లలో మార్పులు జరిగితే పొదుపులు, ఖర్చులకు ఊతం లభిస్తుందని అంచనా.

ఈ నేపథ్యంలో బడ్జెట్ 2026లో పన్ను చెల్లింపుదారులు ఆశిస్తున్న ముఖ్యమైన మార్పుల్లో హెచ్‌ఆర్‌ఏ మినహాయింపుల సవరణ, స్టాండర్డ్ డిడక్షన్ పెంపు, కొత్త పన్ను విధానంలో హెల్త్ ఇన్సూరెన్స్ మినహాయింపు, గృహ రుణ వడ్డీపై అదనపు ప్రయోజనాలు, టీడీఎస్ రేట్ల సరళీకరణ, రియల్‌టైమ్ టాక్స్ రీఫండ్ ట్రాకింగ్ వంటి అంశాలు ఉన్నాయి.

ఇవన్నీ అమలైతే బడ్జెట్ 2026 మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు గణనీయమైన ఊరట ఇవ్వవచ్చని ఆర్థిక వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

ALSO READ:CM Revanth Reddy on T-Hub | T-Hubను ప్రభుత్వ ఆఫీసులుగా మార్చొద్దు: సీఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp