మెదక్ జిల్లా తూప్రాన్ మండల పరిధిలో ని ధాతర్ పల్లి గ్రామ శివారులోని అడవిలో చిత్తు బొత్తు పైసల ఆటలు ఆడుతున్న స్థావరంపై తూప్రాన్ సి.ఐ రంగా క్రిష్ణ ఆధ్వర్యంలో ఆకస్మికంగా మెరుపు దాడులు నిర్వహించారు. వెల్దుర్తి, మనోహరాబాద్ ఎస్.ఐ లు మరియు కొంతమంది పోలీసు సిబ్బంది తో కలిసి సి.ఐ రంగా క్రిష్ణ చాకచక్యంగా సమాచారం మేరకు చిత్తు బొత్తు ఆడుతున్న స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడులలో 6 సెల్ ఫోన్లు, 6 బైకులు స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురిని విచారణ జరుపుతున్నారు. చిత్తుకు లక్ష బొత్తుకు లక్ష అంటూ చిత్తు-బొత్తు పైసల ఆట తూప్రాన్ మండల పరిధిలో గత కొంత కాలంగా లక్షల రూపాయలు పెట్టి ఆటలు ఆడుతూ గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతోంది. ఈ చిత్తు బొత్తు పైసల ఆట లో చాలా మంది జీవితాలు నాశనం అవుతున్నా ఈ ఆటలపై ఇప్పటివరకు ఎలాంటి నిఘా లేకపోగా చర్యలు లేకపోవడంతో ఈ పైసల ఆట జోరుగా కొనసాగింది. ఈ సందర్భంగా సి.ఐ రంగా క్రిష్ణ మీడియా తో మాట్లాడుతూ.. ఇలాంటి ఆటల తో తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని అన్నారు. ఇలాంటివి ప్రోత్సహించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయన్నారు.
చిత్తు బొత్తు పైసల ఆటలపై దాడి చేసిన తూప్రాన్ సి.ఐ
