Saturday, March 21, 2026
Google search engine
HomeInterNationalTrump Warns Iran | అణు ఒప్పందంపై అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు

Trump Warns Iran | అణు ఒప్పందంపై అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు

-

Google search engine

Trump Warns Iran: అమెరికా–ఇరాన్(America-Iran) దేశాల మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అణు ఒప్పందంపై నెలకొన్న విభేదాలు ఇప్పుడు యుద్ధ వాతావరణానికి చేరుకుంది అనే చెప్పాలి. ఇరాన్‌ను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వార్నింగ్ ఇస్తూ హెచ్చరికలు జారీ చేశారు.

అణ్వాయుధాల తయారీని పూర్తిగా అడ్డుకునే కొత్త అణు ఒప్పందంపై తక్షణమే చర్చలకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. చర్చలకు నిరాకరిస్తే ఇరాన్ తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో స్పందించిన ట్రంప్.. అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌకలు ఇప్పటికే ఇరాన్ దిశగా కదులుతున్నాయని వెల్లడించారు. ఇరాన్ నిర్ణయం తీసుకోవడానికి సమయం చాలా తక్కువగా ఉందని, గతం కంటే భీకర దాడులు జరిగే అవకాశముందని హెచ్చరించారు. అణ్వాయుధాలు లేని ప్రపంచమే మానవాళికి మేలు చేస్తుందని వ్యాఖ్యానించారు.

ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ దౌత్య వ్యూహాలకు పదును పెట్టింది. పశ్చిమాసియా దేశాల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తోంది. అమెరికా దాడులకు తమ గగనతలాన్ని ఉపయోగించనివ్వమని సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలు హామీ ఇచ్చినట్లు సమాచారం. ట్రంప్ వ్యాఖ్యలకు ప్రతిగా ఇరాన్ కూడా గట్టిగానే స్పందించింది.

తమపై యుద్ధం మోపితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఎదురుదాడి చేస్తామని హెచ్చరించింది. అదే సమయంలో సమస్యను శాంతియుత చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి తాము సిద్ధమేనని స్పష్టం చేసింది.

also read:Champion on Netflix: ఓటీటీలో సందడి చేస్తున్న రోషన్ మేకా మూవీ

- Advertisement -
Google search engine
- Advertisment -
Google search engine

Must Read

telangana high court hearing plea challenging speaker decision on danam nagender disqualification case

Danam Nagender | హైకోర్టులో ఎమ్మెల్యే దానం పార్టీ ఫిరాయింపు కేసు…స్పీకర్ నిర్ణయానికి సవాల్

Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వివాదం ఇప్పుడు తెలంగాణ హైకోర్టు వరకు చేరడంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది. దానం నాగేందర్ పార్టీ మారలేదని తెలంగాణ అసెంబ్లీ...
- Advertisement -
Google search engine