Monday, March 23, 2026
Google search engine
HomeFilms NewsTollywood News: అల్లరి నరేష్ కుటుంబంలో తీవ్ర విషాదం

Tollywood News: అల్లరి నరేష్ కుటుంబంలో తీవ్ర విషాదం

-

Google search engine

Allari Naresh Family Tragedy: ప్రముఖ దర్శకుడు దివంగత ఈ.వి.వి. సత్యనారాయణ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి, ప్రముఖ నటులు ఆర్యన్ రాజేష్‌, అల్లరి నరేష్‌లకు తాతగారైన ఈదర వెంకట్ రావు మంగళవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో కన్నుమూశారు.

వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్న ఆయన 90 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు.

వెంకట్ రావు భార్య వెంకటరత్నం 2019 మే 27న మరణించారు. వీరికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు దివంగత ఈ.వి.వి. సత్యనారాయణ(EVV Satyanarayana) తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ దర్శకుడిగా గుర్తింపు పొందారు.

ALSO READ:RCB WPL 2026: వరుస విజయాలతో ప్లేఆఫ్స్‌లోకి దూసుకెళ్లిన RCB

రెండో కుమారుడు ఈ.వి.వి. గిరి, మూడో కుమారుడు ఈ.వి.వి. శ్రీనివాస్ కాగా, కుమార్తె ముళ్లపూడి మంగాయమ్మ.

ప్రముఖ నటులు ఆర్యన్ రాజేష్‌, అల్లరి నరేష్‌లు తమ తాతగారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంకట్ రావు పార్థివ దేహానికి నిడదవోలు మండలం కోరుమామిడి గ్రామంలో మంగళవారం సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఈదర వెంకట్ రావు మృతి పట్ల టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ, ఈదర కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

- Advertisement -
Google search engine
- Advertisment -
Google search engine

Must Read

telangana high court hearing plea challenging speaker decision on danam nagender disqualification case

Danam Nagender | హైకోర్టులో ఎమ్మెల్యే దానం పార్టీ ఫిరాయింపు కేసు…స్పీకర్ నిర్ణయానికి సవాల్

Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వివాదం ఇప్పుడు తెలంగాణ హైకోర్టు వరకు చేరడంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది. దానం నాగేందర్ పార్టీ మారలేదని తెలంగాణ అసెంబ్లీ...
- Advertisement -
Google search engine