LIVE
Thursday, October 22, 2026
LIVE
LIVE

Tiger Shroff firing case | టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. ఇద్దరు మహిళలు సహా నలుగురు అరెస్ట్!

by Bajaswamy
4 views
Tiger Shroff firing case

Tiger Shroff firing case: బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకుని జరిగిన కాల్పుల ఘటన ముంబైలో కలకలం రేపింది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేయడంతో ఆయుధాల సరఫరా, నిందితుల ప్రయాణాలు, కాల్పులకు పాల్పడిన వారి మధ్య సంబంధాలపై కీలక వివరాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఢిల్లీ నుంచి ముంబై వరకు నిందితుల జాడ

ముంబైలోని జుహు ప్రాంతంలో అక్టోబర్ 18న టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనకు సంబంధించి ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ నలుగురిని అరెస్ట్ చేసింది. వీరిలో కునాల్ (21), సుమిత్ (19), రాధ (23), బబిత (23) ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి మరో మైనర్ బాలుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నిందితులను విచారణ కోసం ముంబై పోలీసులకు అప్పగించారు. పోలీసుల కథనం ప్రకారం.. కునాల్ అమృత్‌సర్ నుంచి పిస్టల్, 20 తూటాలను సేకరించినట్లు ఆరోపణలున్నాయి. అనంతరం రాధ, బబిత ద్వారా ఆయుధాన్ని ముంబైకి తరలించినట్లు దర్యాప్తులో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎన్‌క్రిప్టెడ్ యాప్ ద్వారా నిందితులు పరస్పరం సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ కేసులో రాజస్థాన్‌లోని కోటా రైల్వే స్టేషన్ వద్ద మరో ముగ్గురిని పోలీసులు, యాంటీ గ్యాంగ్‌స్టర్ టాస్క్‌ఫోర్స్ సంయుక్తంగా అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు హర్యానాకు, మరొకరు బిహార్‌కు చెందినవారని అధికారులు వెల్లడించారు. అరెస్టయిన వారిలో ఇద్దరు కాల్పుల్లో పాల్గొన్నట్లు ఆరోపణలున్నాయి. ఘటనకు ఉపయోగించిన మోటార్‌సైకిల్ ముంబైలోని అంధేరి ప్రాంతంలో లభ్యమైంది. కాల్పుల అనంతరం లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో సోషల్ మీడియాలో బాధ్యత వహిస్తున్నట్లు ఓ పోస్ట్ వెలువడింది. అయితే ఈ పోస్ట్ వెనుక ఉన్నవారి పాత్రపై దర్యాప్తులో తేలాల్సిన అంశాలు ఉన్నాయి. కాల్పుల ఘటనలో టైగర్ ష్రాఫ్‌కు గాయాలు కాలేదు. ఆయన కారు డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి కూడా గాయపడినట్లు తెలుస్తోంది. ఆయుధాలను సమకూర్చినవారు, వాటిని తరలించినవారు, కాల్పులకు పాల్పడినవారి మధ్య ఉన్న సంబంధాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ ఘటన వెనుక ఉన్న పూర్తి నెట్‌వర్క్‌ను గుర్తించడంతో పాటు, దాడికి సంబంధించిన అన్ని కోణాలను వెలికితీసేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.

banner
banner

You may also like

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More