Monday, March 23, 2026
Google search engine
HomeTelanganaTelangana Regional Ring Road | భూసేకరణ, టెండర్లపై కీలక నిర్ణయం

Telangana Regional Ring Road | భూసేకరణ, టెండర్లపై కీలక నిర్ణయం

-

Google search engine

Telangana Regional Ring Road: హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్ (RRR) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్ వెలువడింది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ఈ ప్రాజెక్టును 5 ప్యాకేజీల నుంచి 2 ప్యాకేజీలకు కుదించింది. దీంతో కొత్తగా మరోసారి టెండర్లు ఆహ్వానించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ రహదారికి “ఎన్‌హెచ్‌–161AA” నంబర్ కేటాయించడంతో ప్రాజెక్టు మరింత ముందడుగు వేసినట్లైంది.

తెలంగాణకు గేమ్‌ ఛేంజర్‌గా భావిస్తున్న రీజినల్ రింగ్ రోడ్‌ను ఉత్తర, దక్షిణ భాగాలుగా నిర్మిస్తున్నారు. ఉత్తర భాగంలో ప్యాకేజీ–1 కింద సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ నుంచి సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ వరకు 83.50 కి.మీ మేర రహదారి నిర్మాణం చేపట్టనున్నారు.

దీనికి అంచనా వ్యయం రూ.10,506.29 కోట్లు. ప్యాకేజీ–2లో ప్రజ్ఞాపూర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా తంగడ్‌పల్లి వరకు 78 కి.మీ మేర రహదారి నిర్మాణం జరగనుంది. దీని వ్యయం రూ.10,231.17 కోట్లు.

ఇంతకుముందు 5 ప్యాకేజీలుగా పిలిచిన టెండర్లకు ఒక్క బిడ్ కూడా దాఖలు కాకపోవడంతో ఈ మార్పు చేసినట్లు సమాచారం. భూసేకరణలో 70 శాతం వరకు అవార్డులు పూర్తయ్యాయి.

పర్యావరణ, అటవీ అనుమతులు కూడా పూర్తవ్వడంతో, కేబినెట్ కమిటీ ఆమోదం తర్వాత “HAM విధానంలో” కొత్త టెండర్లు పిలవడానికి NHAI సిద్ధమవుతోంది.

ALSO READ:Telangana Railway Projects | రైల్వే నెట్‌వర్క్ విస్తరణకు…కేంద్రం గుడ్‌న్యూస్

- Advertisement -
Google search engine
- Advertisment -
Google search engine

Must Read

telangana high court hearing plea challenging speaker decision on danam nagender disqualification case

Danam Nagender | హైకోర్టులో ఎమ్మెల్యే దానం పార్టీ ఫిరాయింపు కేసు…స్పీకర్ నిర్ణయానికి సవాల్

Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వివాదం ఇప్పుడు తెలంగాణ హైకోర్టు వరకు చేరడంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది. దానం నాగేందర్ పార్టీ మారలేదని తెలంగాణ అసెంబ్లీ...
- Advertisement -
Google search engine