Thursday, March 26, 2026
Chat on WhatsApp
HomeTelanganaHyderabadఐపీఎస్ అధికారులకు ఐఏఎస్ హోదా ఎందుకు? తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

ఐపీఎస్ అధికారులకు ఐఏఎస్ హోదా ఎందుకు? తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

-

Chat on WhatsApp

Telangana IPS IAS Notice: తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు కీలకంగా స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 26న విడుదల చేసిన జీవో 1342 ప్రకారం ఐపీఎస్ అధికారులకు ఐఏఎస్ హోదా కల్పించడం చట్టవిరుద్ధమని వడ్ల శ్రీకాంత్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. శిఖా గోయల్, సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర వంటి ఐపీఎస్ అధికారులను ఐఏఎస్ క్యాడర్‌లో ఎలా కొనసాగిస్తున్నారో సరైన కారణాలు తెలియజేయాలని కోర్టు స్పష్టం చేసింది.

న్యాయమూర్తి సూరేపల్లి నంద పిటిషన్‌ను పరిశీలిస్తూ చీఫ్ సెక్రటరీకి నోటీసులు జారీ చేశారు. ఐపీఎస్ అధికారులకు ఐఏఎస్ హోదా ఎందుకు ఇచ్చారో సంబంధిత వివరాలతో కలిసి “డిసెంబర్ 10వ తేదీ లోపు” కోర్టుకు సమాధానం ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సర్వీస్ రూల్స్‌కు వ్యతిరేకమని పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సమర్పించాల్సిన వివరణపై అన్ని వర్గాల దృష్టి కేంద్రీకృతమైంది.

ALSO READ:తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు పోలీస్ కిష్టయ్య వర్ధంతి: గజ్వేల్‌లో నివాళులు

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp