తెలంగాణ ప్రభుత్వం సోషల్ మీడియా వేదికగా అభ్యంతరకర పోస్టులపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇటీవల అల్లు అర్జున్ అరెస్ట్ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొందరు అభిమానులు చేసిన పోస్టులపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
కాంగ్రెస్ నేతలు, ఇతర రాజకీయ నాయకుల ఫిర్యాదుల ఆధారంగా, ముఖ్యంగా రేవంత్ రెడ్డిపై దూషణలపై కేసులు నమోదు చేయడం జరిగిందని తెలుస్తోంది. నకిలీ అకౌంట్లు ఉపయోగించి అసభ్య పదజాలంతో చేసిన పోస్టులపై కూడా పోలీసులు దృష్టి సారించారు.
అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంపై అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ భావాలను తెలియజేయడంలో ఎటువంటి తప్పు లేదని ఫ్యాన్స్ వాదిస్తున్నా, అసభ్య పదజాలం వల్ల సమాజంలో కలహాలు పెరుగుతాయని పోలీసులు వ్యాఖ్యానించారు.
రాష్ట్ర ప్రభుత్వం సామాజిక మాధ్యమాల దుర్వినియోగంపై ప్రత్యేక నిఘా వేస్తోందని వెల్లడించింది. ఫ్యాన్స్ మాత్రం తమ అభిప్రాయాలను వ్యక్తపరచడాన్ని అర్ధం చేసుకోవాలని, దీన్ని తప్పుగా చూడరాదని విజ్ఞప్తి చేస్తున్నారు.