Thursday, March 19, 2026
No menu items!
spot_img
HomeFilms News'పుష్ప-2' టికెట్ ధరల పెంపుకు తెలంగాణ సర్కారు గ్రీన్ సిగ్నల్

‘పుష్ప-2’ టికెట్ ధరల పెంపుకు తెలంగాణ సర్కారు గ్రీన్ సిగ్నల్

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప-2’ సినిమా టికెట్ ధరల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. శనివారం నాడు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా కోసం డిసెంబర్ 4న బెనిఫిట్ షోల నిర్వహణకు కూడా అనుమతి లభించింది.

డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటల షోకు టికెట్ ధరను అదనంగా రూ.800 పెంచింది. ఈ షో కోసం సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ థియేటర్లలో ఈ అదనపు ధర చెల్లించాల్సి ఉంటుంది. పెంపుతో కలుపుకొని సింగిల్ స్క్రీన్‌లో టికెట్ ధర రూ.1000 కాగా, మల్టీప్లెక్స్‌లో ఇది రూ.1200 పైగా అవుతోంది.

డిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్‌లలో రూ.150, మల్టీప్లెక్స్‌లలో రూ.200 అదనపు ధరను అనుమతించింది. అలాగే డిసెంబర్ 9 నుంచి 16 వరకు ఈ ధరలను సింగిల్ స్క్రీన్‌లలో రూ.105, మల్టీప్లెక్స్‌లలో రూ.150 చొప్పున తగ్గించింది.

డిసెంబర్ 17 నుంచి 23 వరకు ఈ అదనపు ధరలు సింగిల్ స్క్రీన్‌లలో రూ.20, మల్టీప్లెక్స్‌లలో రూ.50 తగ్గించేందుకు సర్కారు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాలు సినిమా ప్రేమికుల మధ్య పెద్ద చర్చకు దారితీశాయి.

- Advertisement -
- Advertisment -

Must Read

oil and gas storage tanks representing india energy security monitoring system

India energy security | ఇంధన భద్రతపై కేంద్రం అలర్ట్‌.. ఆయిల్ కంపెనీలకు కీలక...

India energy security: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరా అంతరాయం కలగకుండా కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో చమురు మరియు సహజ వాయువు సంస్థలకు కీలక...