Tamil Nadu Bride Assault Case: తమిళనాడు తిరువళ్ళూరు జిల్లా, తిరుత్తణికి చెందిన ఒక యువతికి, వివాహ సమాచార కేంద్రం ద్వారా పురసైవాక్కంకు చెందిన అగస్టిన్ జోష్వాతో తిరుత్తణి ప్రాంతానికి చెందిన యువకుడు నవంబర్ 23న కుటుంబాల సమ్మతితో వివాహం అయింది.
మొదటి రాత్రే భార్య “ముందుగా మనం ఒకరినొకరు అర్థం చేసుకుందాం, ఆ తర్వాతే సంబంధం పెట్టుకుందాం” అని చెప్పడంతో అగస్టిన్ అసహనం వ్యక్తం చేశాడు. తరువాతి రోజు కూడా ఇదే విషయంపై వాగ్వాదం తీవ్రరూపం దాల్చింది.
కోపంతో అగస్టిన్ సుత్తితో భార్యపై దాడి చేసి, ఆమెను ఒక గదిలో బంధించి చిత్రహింసలకు గురిచేశాడు. తీవ్ర గాయాలతో ఉన్న బాధితురాలుని చికిత్స కోసం వెంటనే రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పోలీసుల దర్యాప్తులో అగస్టిన్ ఇదివరకే ఇద్దరు మహిళలతో సహజీవనం పేరుతో హింసాత్మక ప్రవర్తన చేశాడని బయటపడింది. ఈ వివరాలు దాచిపెట్టి వివాహం చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
బంధనం, ఆయుధ దాడి, బెదిరింపు, మహిళా వేధింపుల చట్టం సహా ఏడు సెక్షన్ల కింద అగస్టిన్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ ఘటనతో వధువు కుటుంబం తీవ్ర ఆందోళనలో ఉంది.
