Ibomma Ravi Case | ‘పోటీలేని వ్యాపారమని పైరసీ’ చేశా..విచారణలో సంచలన విషయాలు
ibomma ravi: తెలుగు సినీ ఇండస్ట్రీని గజగజలాడించిన పైరసీ కేసులో ఐబొమ్మ రవి పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల అరెస్ట్ అయిన రవిని పోలీసులు మూడోసారి సైబర్‌క్రైమ్ కస్టడీకి అప్పగించారు. నాంపల్లి కోర్టు 12 రోజుల పాటు విచారణకు అనుమతి ఇచ్చింది. కస్టడీ విచారణలో రవి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించినట్టు అధికారులు తెలిపారు. తాను సినిమా వెబ్‌పోర్టల్స్‌కు కేవలం సేవలు మాత్రమే అందించానని, ఇతర ఉద్యోగాల మాదిరిగానే దీనిని ఎంపిక చేసుకున్నానని…
