Zero Pollution Mission: కాలుష్యంపై చంద్రబాబు సమీక్ష – బయోషీట్లు వాడకాన్ని ప్రోత్సహించాలి
ఆంధ్రప్రదేశ్లో కాలుష్యాన్ని తగ్గించేందుకు అన్ని రకాల ప్లాస్టిక్ వ్యర్థాలను సైంటిఫిక్ ప్రాసెస్ ద్వారా తొలగించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను సైంటిఫిక్ ప్రాసెస్ ద్వారా నిర్మూలించేందుకు కొత్త విధానాన్ని సిద్ధం చేయాలని ఆయన సూచించారు. పర్యావరణ పరిరక్షణ, గాలి నాణ్యత మెరుగుదల, నీటి కాలుష్య నియంత్రణ అంశాలపై సమీక్ష నిర్వహించిన సీఎం రాష్ట్రాన్ని ‘జీరో పొల్యూషన్’ దిశగా తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. కాలుష్య నియంత్రణ నిబంధనలను ఉల్లంఘించే సంస్థలు,…
